రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సలావుద్దీన్ కుటుంబాన్ని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి బుధవారం నాడు పరామర్శించారు.మాజీ మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు తాజోద్దీన్ కుమారుడు సలావుద్దీన్ హిందీ పండిత్ ఉపాధ్యాయుడు గా కాట్రియాల జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నాడు.ఇటీవల విధులు ముగించుకొని తిరిగి ఇంటికి స్వగ్రామమైన అక్కన్నపేటకు వస్తున్న క్రమంలో తోనిగండ్ల శివారులో కారు బైక్ డికోన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సలావుద్దిన్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి, ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఆమె వెంట మాజీ ఎంపీపీ భిక్షపతి,వైస్ ఎంపీపీ సిద్దరాంరెడ్డి,భారస మండల యూత్ అధ్యక్షులు రాగి ఉమామహేశ్వర్, కాట్రియల మాజీ సర్పంచ్ శ్యామ్,నాయకులు చిట్టిమల్ల నరేందర్ రెడ్డి,శ్రీకాంత్ సాగర్,శ్రావణ్ గౌడ్,రాంకీ,శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
