రామాయంపేట (నేటి దగ్గర ప్రతినిధి) ఫిబ్రవరి 12:-మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు వాల్దేశ్ మల్లేష్ గౌడ్ మరియు మెదక్ గ్రాడ్యుయేట్ ఇంచార్జ్ గడ్డం శ్రీనివాస్ మరియు గ్రాడ్యుయేట్ ప్రబారి విష్ణువర్ధన్ రెడ్డి టీచర్ ఎమ్మెల్సీ ఇన్చార్జ్ మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగి రాములు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు వెళ్లి వివరిస్తామన్నారు.మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం పొందే దిశగా ప్రచారం నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న మైన శ్రీనివాస్,జిల్లా ఉపాధ్యక్షుడు తీగల శ్రీనివాస్ గౌడ్ ,ఓబీసీ మోర్చా స్టేట్ మెంబర్ చింతల శేఖర్,పట్టణ ఇన్చార్జి వెలుముల సిద్ధ రాములుపట్టణ అధ్యక్షుడు శీలం అవినాష్ రెడ్డి, మండల అధ్యక్షుడు నవీన్ గౌడ, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు సంగయ్య గారు,మండల ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్,సీనియర్ నాయకులు,శంకర్ గౌడ్,బక్కయ్య గారి యాదగిరి,వెలుముల రమేష్,నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
