+91 95819 05907

మిర్చి కనీస మద్దతు ధర 25 వేలు చెల్లించాలి :CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం.

మిర్చి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి….CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం.

ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలి…

17న రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద జరుగు మిర్చి రైతుల ధర్నాకు సిపిఎం మద్దతు.

నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతి నిధి

వైరా :మిర్చి రైతులకు మార్కెట్ లో కనీస మద్దతు ధర కల్పించి రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిధిలోని అష్ట గుర్తు గ్రామంలో మిర్చి రైతుల కల్లాలో సిపిఎం నేతలు సుంకర సుధాకర్ తోము సుధాకర్ తో కలిసి పర్యటించారు. మిర్చి రైతులతో మాట్లాడి పెట్టిన పెట్టుబడి ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో సరైన రేటు లేక కల్లాలోనే మిర్చి ఉంచామని మద్దతు ధర లేకపోతే కుటుంబాల అప్పుల పాలై మరణాలే శరణం అని రైతు చిత్తారి వెంకటనర్సయ్య రామారావు లు బృందం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులను ఓదార్చారు. భూక్యా వీరభద్రం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం మద్దతు ధర మిర్చి పంటకు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు వెంటనే చేయాలని కోరారు. ఈనెల 17న ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నా సిపిఎం సంపూర్ణగా మద్దతు ఇస్తుందని తెలిపారు. మిర్చి రైతుల అధిక సంఖ్యలో పాల్గొని మిర్చి రైతుల ధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు స్పందించకపోతే మిర్చి రైతుల పక్షాన పోరాడుతామని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ట్రై కార్ రుణాలను రద్దు చేయడం దారుణం… భూక్యా వీరభద్రం

గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది: గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం ఏప్రిల్ 7వ తేదీన చలో హైదరాబాద్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతి నిధి: 2022 –

Read More »

మెదక్ మున్సిపల్ చైర్మన్ రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీలకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ కు దళిత సంఘాల నాయకుల వినతి

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 27. మెదక్ మున్సిపల్ చైర్మన్ గత 1952 నుండి ప్రత్యేకంగా ఎస్సీ రిజర్వేషన్లు కేటాయించలేదని అన్నారు ఎస్సీ ప్రజల జనాభా ప్రాతినిథ్యం

Read More »

జవహర్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో నాగులవంచ శ్రీ గ్లోబల్ హై స్కూల్ విద్యార్థి ప్రభంజనం

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిది ఖమ్మం, పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులంచ విద్యార్థి ప్రభంజనం. అనంతసాగర్ గ్రామం చింతకాని మండలానికి

Read More »

మెదక్ జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశము.

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 27. గురువారం రోజు ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ గారి అధ్యక్షతన జిల్లా

Read More »

ఎన్ఆర్ఈజిఏ నిధులతో సిసి రోడ్ల నిర్మాణం

బిజెపి జిల్లా నాయకులు ఈర్ల రంజిత్ రెడ్డి. హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 27. హవేలీ ఘన్పూర్ మండలం వాడి గ్రామంలో మెదక్ పార్లమెంటు సభ్యుడు శ్రీ

Read More »

పి.ఎ.సి.యస్ నాగులవంచ సంఘ కార్యాలయంలో మహాజనసభ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిది పి.ఎ.సి.యస్ నాగులవంచ సంఘ కార్యాలయంలో ఈరోజు మహాజనసభ సమావేశం జరిగింది సంఘ అధ్యక్షులు శ్రీ నల్లమోతు శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘ అభివృద్ధి విషయాలపై అధ్యక్షులు

Read More »

 Don't Miss this News !