*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, మండలంలోని ఆదివాసి యువత విద్య క్రీడలపై మక్కువ పెంచుకొని రానించాలని గుండాల సీఐ ఎల్ రవీందర్ సూచించారు. బుధవారం మండలం పరిధిలోని అడవిరామారం గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్ అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అసాంఘిక శక్తులకు సహకరించవద్దని అలాంటివారికి దూరంగా ఉండాలని సూచించారు. ఆదివాసి సమాజం చైతన్యవంతంగా ఉంటూ ముందుకు నడవాలని ఆయన అన్నారు. విద్య క్రీడలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. ఆదివాసి గ్రామాల్లోకి అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరించినట్లయితే తక్షణమే స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని సూచించారు. చెడు అలవాట్లకు బానిస కావటం ద్వారా విలువైన జీవితం చిన్నాభిన్నం అవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Post Views: 85