రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 13:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ ఆయన స్వగృహంలో స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణన సర్వేను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం కుల గణన సర్వేపై సంచలన నిర్ణయం తీసుకున్నదని సర్వేలో పాల్గొనని వారికోసం మరోసారి అవకాశం ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలిపిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కులగనన సర్వేలో పాల్గొనాలని అయన అన్నారు.సర్వేలో భాగంగా ఈనెల 16 నుంచి 28 వరకు ప్రజలు వివరాలు ఇవ్వాలని సూచించారు.ఈ సర్వేలో 31% మంది ప్రజలు పాల్గొనలేదని కొత్త సర్వేలో వారు పూర్తి వివరాలు ఇచ్చి రాష్ట్ర జనాభా లెక్కల్లో పేరు వచ్చేలా చూసుకోవాలని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కులగణన సర్వేలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అయన పిలుపునిచ్చారు.









