*నేటి గద్దర్ న్యూస్ గుండాల*,తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భవ దినోత్సవం గుండాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పార్టీ అధ్యక్షు తోలెం సాంబయ్య మాట్లాడుతూ టిడిపి పార్టీ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. మండల కేంద్రంలో జండా ఎగరవేసి ఘనంగా ఆవిర్భావాన్ని నిర్వహించారు. తెలుగు ప్రజలకు రాజకీయ సామాజిక ఆర్థిక అంశాలలో ముందుకు తీసుకెళ్లి తెలుగు ప్రజలను చైతన్యపరిచిన ఏకైక నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారు. ఆయనను మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా గుర్తుంచుకునే విధంగా తెలుగు ప్రజలను ముందుకు తీసుకెళ్లిన నాయకుడు, ఆయన పేద ప్రజల కోసం పనిచేసిన గొప్ప నాయకుడు, కూడు గూడు గుడ్డ అనే గొప్ప నినాదంతో తెలుగు ప్రజలకు ఎనలేని సేవ చేసిన నాయకుడు, ఈ ఉగాది నుండి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవంతో ముందుకెళ్లి గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పుంజుకుంటుందని రానున్న రోజులు తెలుగుదేశం పార్టీకే ప్రజలు పట్టం కడతారని ఇక నుండి రాష్ట్ర ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకొని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని ప్రభుత్వాన్ని ప్రజల తరుపున నిలదీస్తామని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో
మండల నాయకులు తాటి లక్ష్మయ్య, వాగబోయిన కృష్ణ, ఇర్ఫా విష్ణు
తదితరులు పాల్గొన్నారు.
