రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండోవ డివిజన్ ఇందిరమ్మ కాలని,పీకే రామయ్యా కాలనిలకు చెందిన 70 ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక ను అందజేసినట్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ 29 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేసి సోమవారం రోజున ఆనందంగా జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా మా డివిజన్ ముస్లిం కుటుంబ సభ్యులకు నావంతుగా చిన్న కనుక అందజేయడం నాకు చాలా సంతోషంగా ఉందని గతంలో నేను రెండవ డివిజన్ లో కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయిన మూడు నెలలకు కరోనా వచ్చిందని అదే సమయంలో రంజాన్ పండగ కూడా రావడం జరిగిందని కరోనా సమయంలో మా ముస్లిం కుటుంబ సభ్యులు పండగ జరుపుకోవడం ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకొని 2020 సంవత్సరమున నేను రంజాన్ కానుక అందజేయడం జరిగిందని ఆరోజు నుండి ఇప్పటివరకు ఇచ్చిన మాట తప్పకుండా మా ముస్లిం కుటుంబాలకు నా తరుపున చిన్న కానుక అందిస్తున్నానని పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఈ కానుక అందించడం నా అదృష్టంగా భావిస్తున్నానని ప్రతి ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మడిపెల్లి మల్లేష్ అన్నారు
ఈ కార్యక్రమంలో రెండవబ్ డివిజన్ సోషల్ మీడియా ఇన్చార్జి గుర్రాల మల్లేష్ యాదవ్, ముత్యాల వివేక్.కదాసి శ్రీనివాస్,కోట వెంకట్, అవునూరి,md షరీఫ్, సందీప్,బొజ్జయం కుమారస్వామి,తదితరులు పాల్గొన్నారు
