రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 30:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతారి పల్లి గ్రామ శివారులో అడవి పంది ఆటోకు అడ్డు రావడంతో ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం మల్లుపల్లి కి చెందిన భాను చందర్ (24) హైదరాబాద్ మేడ్చల్ ప్రాంతంలో రాపిడ్ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.గత శనివారం రాత్రి అందాజా 11 గంటల రాత్రి సమయంలో TS35TA4392 నెంబర్ గల ఆటోలో అమ్మమ్మ ఇంటికి సుతారి పల్లికి వస్తున్న క్రమంలో పోచమ్మ గుడి వద్దకు రాగానే ప్రమాదవశాత్తు అడవి పంది అడ్డు రావడంతో ఆటో అదుపు తప్పి అతనిపై బోల్తా పడి మృతి చెందినట్లు తెలిపారు.గల్లా నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రామాయంపేట ఎస్సై బాలరాజ్ తెలిపారు.
Post Views: 364