రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 30:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో ఉగాది పండగను పురస్కరించుకొని శ్రీ పెద్దమ్మ దేవాలయం వద్ద పండితులు వెంకటేశం ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం గ్రామ ప్రజలకు వినిపించారు.ఈ సందర్భంగా విశ్వావసు నామా తెలుగు సంవత్సరం ప్రారంభంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల భవిష్యత్తులో ఎలా ఉండబోతుందని రాశి ఫలాల ద్వారా చాలా చక్కగా గ్రామ ప్రజలకు వివరించారు.అదేవిధంగా ఈ సంవత్సరం కాలం ఖరీఫ్ రభీ వరి పంటలపై పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో రైతులకు కూడా వివరించడం జరిగింది.ఈ పంచాంగ శ్రవణం గ్రామస్తులు చాలా ఆసక్తితో ఆలకించారు.ఈ కార్యక్రమంలో పండితులు వెంకటేశం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 87