గుడుంబా స్థావరాలపై మెరుపు దాడి
కరకగూడెం :
నిషేధిత గుడుంబా తయారు చేస్తున్న స్థావరాల పై అధికారులు మెరుపు దాడి చేసి స్థావరాలను ధ్వంసం చేసిన సంఘటన ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… మండల పరిధిలోని కౌలూరు అటవీ ప్రాంతంలో కొందరు రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకొని నిషేధిత గుడుంబా తయారు చేస్తున్నట్లు తెలియడంతో కరకగూడెం ఎస్ఐ రాజేందర్ తన సిబ్బందితో గుడుంబా స్థావరాలపై మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడులలో గుడుంబా తయారీకి వినియోగించే సుమారు 3000 లీటర్ల పానకాన్ని గుర్తించి, ధ్వంసం చేశారు. నిషేధిత కుటుంబాలు ఎవరైనా తయారుచేసిన, విక్రయించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. కరకగూడెం మండలంలో ఎవరైనా వ్యక్తులు గుడుంబాను తయారుచేసిన, అమ్మిన డయల్ 100 లేదా, స్థానిక పోలీస్ స్టేషన్లో తగిన సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.