రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 30 :- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో విశ్వావసు నామ తెలుగు సంవత్సరం ఉగాది పండుగ సందర్బంగా పట్టణంలోని ప్రజలు ఉదయం పూట ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు.తదనంతరం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద పండితులు వెంకటేశం శర్మ పంతులు ఆధ్వర్యంలో ఉగాది పండగ సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద ఉగాది పచ్చడి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు పచ్చడిని సేవించారు.అనంతరం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో వెంకటేశం పంతులు ప్రసంగిస్తూ ఉగాది నూతన సంవత్సరం మొదలుకొని 12 నెలల పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దానిపై రాశుల ద్వారా ఆయన తెలిపారు.అదేవిధంగా రైతులకు వ్యవసాయ రంగం పై కాలం పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్న విషయాలు చాలా చక్కగా పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రజలు ఎలా సుఖ సంతోషాలు కలిగి జీవిస్తారు.అనే విషయాలపై ఆయన ప్రజలకు క్లుప్తంగా వివరించడం జరిగిందని వెల్లడించారు.ఈ పంచాంగ శ్రవణంలో రామాయంపేట పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పంచాంగ శ్రవణాన్ని ఆలకించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
