నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మార్చి 31.
మెదక్ జిల్లా నుండి డిల్లీ లో బీసీ పోరు పోరు గర్జనకు మెదక్ జిల్లా బీసీ సంగం నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీ కీ బయలు దేరీ వెళ్లారు, తెలంగాణ సర్కారు బీసీ ల కోసం ప్రవేశ పెట్టిన 42 శాతం పార్లమెంటు లో ప్రవేశ పెట్టాలని, తర, తరాలుగా అగ్రవర్ణాల చేతిలో బీసీ లను ఓట్లు వేసే యంత్రాలు గా జండా మోసే కూలీలుగా మార్చారని, ఇఇప్పటికైనా చట్ట సభల్లో జనాభా ధమాషా ప్రకారం సీట్లు కేటాయించాలని, మే మెంతో, మాకు అంత. దిశగా వాటా ఇవ్వాలని వారు డిమాండు చేసారు, మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు 100 మంది బీసీ ప్రతినిధులు ఢిల్లీ కీ బయలు దేరీ వెళ్లారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీసీ వైస్ ప్రెసిడెంట్ చిన్న లింగ్ మళ్ళీ ఖార్జున్ గౌడ్, బీసీ సంఘం సెక్రటరీ యాదగిరి యాదవ్, బీసీ సంఘం నర్సాపూర్ ఇంచార్జ్ నరేందర్ గౌడ్,మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ రమేష్, సమంత్ గౌడ్, యాదగిరి, ఎగొండ, శ్రీకాంత్ క్రమశిక్షణ కమిటీ ప్రెసిడెట్ గణేష్ ముదిరాజు పాల్గొన్నారు.