రామాయంపేట పట్టణంలో ఘనంగా రంజాన్ పండగ వేడుకలు
రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 31:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ముస్లింలు సోదరులు అత్యంత పవిత్రంగా భావించే ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగను ఆదివారం నెలవంక దర్శనం ఇవ్వడంతో 40 రోజుల పాటు చేసిన ఉపవాస దీక్షలు నమాజుతో విరమించారు.సోమవారం నాడు రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులు మెదక్ చౌరస్తాలో ఉన్న ఈద్గా వద్ద పిల్లలు,పెద్దలు ఉదయం నూతన దుస్తులు ధరించి మసీదుల వద్దకు వెళ్ళి సామూహికంగా ప్రార్థనలు చేస్తారు.ముస్లింల గురువు రంజాన్ పండుగ ప్రాముఖ్యతను గురించి వారికి వివరించారు.అనంతరం గతించిన కుటుంబ సభ్యుల సమాధుల వద్దకు వెళ్లి ముస్లిం సోదరులు నివాళులర్పించారు.ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.అదేవిదంగా నిరుపేదలకు వారు దానధర్మాలు చేశారు.మత సామరస్యానికి ప్రతీకగా ఈ రంజాన్ పండుగ వేడుకలు ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.