_ *బాధితురాలి తరఫున వాదించనున్న జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్*
_ ఎయిడ్ ఎన్జీవో డైరెక్టర్ పి ఎస్ ఎస్ హరి ప్రసాదరావు
11 ఏళ్ల బాలిక వక్షోజాలను పట్టుకోవడం ఆమె పైజామా దారాన్ని విరగొట్టడం మరియు ఆమెను కల్వర్టు కిందకు లాగడం అత్యాచార ప్రయత్నం కాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై గౌరవ భారత సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది.
ఈ నిర్ణయం పిల్లల హక్కుల పరిరక్షణకు ఒక ముఖ్యమైన అడుగుగా యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ పి ఎస్ ఎస్ హరిప్రసాదరావు అభివర్ణించారు
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఆలయన్స్ దాఖలు చేసిన ప్రత్యేక లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు అంగీకరించింది మరియు బాధితురాలికి ప్రాతినిధ్యం వహించడానికి అనుమతి ఇచ్చింది అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు
జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ పిల్లల రక్షణ మరియు హక్కుల కోసం 416 జిల్లాల్లో 250 కి పైగా ఎన్జీవోల నెట్వర్క్ తో కలిసి పోరాడుతోంది
యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మరియు సూర్యాపేట జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుందని దేశంలో ఒక్క ఆడబిడ్డ కూడా అన్యాయానికి గురి కాకూడదని అలాంటి వారికి ఈ అలయన్స్ అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు
పిల్లల హక్కుల పట్ల సర్వోన్నత న్యాయస్థానం ఎంత సున్నితంగా వ్యవహరిస్తుందో ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోవడం ద్వారా మనకు అర్థమవుతుందని అలయన్స్ పిల్లల కోసం న్యాయపరమైన హక్కుల కోసం పోరాడుతుందని బాల్యవివాహాలు మరియు బాలలపై లైంగిక వేధింపులు, బాల కార్మిక వ్యవస్థ వంటి నేరాలను నిర్మూలించడానికి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు
అలహాబాద్ హైకోర్టు నిర్ణయం పై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు వారు ఈ తీర్పు షాకింగ్ మరియు అసమర్థమైనది అని తీవ్రంగా వ్యాఖ్యానించిందని తెలిపారు
ఈ కేసులో ముఖ్య విషయాలను ఆయన తెలియజేస్తూ ఈ తీర్పులో చేసిన కొన్ని పరిశీలనలు ముఖ్యంగా 21 24 మరియు 26 పేరాలలో తీర్పు పూర్తిగా సున్నితత్వం లేకపోవడాన్ని గుర్తించారని దాదాపు నాలుగు నెలల చర్చల తర్వాత ఇచ్చిన ఈ తీర్పు చట్ట విరుద్ధంగా అమానవీయంగా ఉందని ధర్మాసనం పేర్కొందని తెలిపారు మూడున్నర సంవత్సరాలకు పైగా ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయబడలేదని మరియు అధికారిక దర్యాప్తు ప్రారంభించకుండా మూడు సంవత్సరాలకు పైగా కాలయాపన జరిగిందని తెలిపారు . పేద మరియు దుర్బలమైన బాల బాధితురాలికి ఈ సుదీర్ఘ నిష్క్రియాత్మకమైన , తీవ్రమైన అన్యాయం జరిగిందని గౌరవ న్యాయస్థానం గుర్తించిందని తెలిపారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ ఈ నేరాన్ని అత్యాచార ప్రయత్నంగా పరిగణించి నిందితులకు ఫోక్సో చట్టంలోని సెక్షన్ 376 తో కలిపి సెక్షన్ 18 కింద విచారణ కొరకు కోర్టు సమన్లు జారీ చేసింది అయితే బాలిక రొమ్ములను పట్టుకొని బలవంతంగా కల్వర్టు కిందకు లాగడం దారిన వెళ్లేవారు వచ్చినప్పుడు పారిపోవడం సెక్షన్ 376/51 ఐపిసి కింద అత్యాచారం చేయడానికి ప్రయత్నించడం లేదా ఫోక్సో చట్టంలోని సెక్షన్ 376 ఐపిసి కింద అత్యాచారం సెక్షన్ 18 తో కలిపి నేరంగా నిర్ధారించడం సరిపోదని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది తత్ఫలితంగా ఈ అభియోగాన్ని పోకుసో చట్టంలోని సెక్షన్ 351 (బి)ఐ పి సి సెక్షన్ 9/10 తో కలిపి సవరించారు గౌరవనీయులైన సుప్రీంకోర్టు భారతీయ యూనియన్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మరియు కేసులో పాల్గొన్న అన్ని పార్టీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ బాధితురాలి గౌరవం మరియు హక్కులు కాపాడబడతాయని సుప్రీంకోర్టుపై తమకు న్యాయం ఉందని చట్టపరమైన చర్యలకు ఇప్పుడు నాయకత్వం వహిస్తుందని పి ఎస్ ఎస్ హరి ప్రసాద్ రావు తెలిపారు
బాలల సమస్యలను గుర్తిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా డయల్ 100 లేదా 18001027222 కి ఫోన్ చేసి తెలిపి బాలల హక్కుల రక్షణలో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు
