హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 31.
మెదక్ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ లోని ఈద్గా వద్ద మైనారిటీ సోదరులు రంజాన్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి. సుభాష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బట్టి జగపతి,అకిరెడ్డి కృష్ణారెడ్డి,మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ లు పాల్గొని ముస్లిం మతం పెద్దలకు, సోదరులకు రంజాన్ (ఈద్ ముబారక్) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దలు సర్దార్ మమ్మ హుస్సేన్, శంషుద్దీన్, మహ్మద్ అలీ, కురనోద్దిన్ యూసుఫ్ లు ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి, శేరి. సుభాష్ రెడ్డి లు మాట్లాడుతూ రంజాన్ పవిత్రత త్యాగం, శాంతి, సమానత్వానికి ప్రతీక అని అన్నారు.మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయన్నారు. అన్ని మతాల ప్రజలలు స్నేహభావంతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు.
ముస్లిం సోదర సోదరీమణులంతా పండగ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బట్టి. జగపతి, కృష్ణ రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల.మల్లికార్జున్ గౌడ్, పట్టణ కన్వీనర్ తాజా మాజీ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, కొ కన్వీర్ కృష్ణ గౌడ్, జుబేర్ అహ్మద్, నాయకులు మహమ్మద్, ఫజిల్, మధు, మోహన్, నాగేందర్, సంతోష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.