+91 95819 05907

నియంతలాగా వ్యవహరిస్తున్న రేవంత్‌ రెడ్డి నిర్భందాన్ని ప్రయోగిస్తూ అక్రమ అరెస్టులు చేస్తే ఊరుకునేది లేదు :SFI-PDSU

– వేలం వేస్తున్న భూములలో జేసీబీలను, బుల్డోజర్లను వెనక్కి పంపాలి`
-ఎస్ఎఫ్ఐ- పిడిఎస్యు భద్రాచలం డివిజన్ కమిటీ డిమాండ్‌.

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం .
*SFI-PDSU*

– విద్యార్థుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా భద్రాచలం పట్టణ కేంద్రంలోని నిరసన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సమైక్య (పిడిఎస్యు) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది,ఈ కార్యక్రమం రవీందర్, రామ్ చరణ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది అనంతరం, ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు రాష్ట్ర నాయకులు శివ ప్రశాంత్, భూపేందర్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేసిందని, నియంతృత్వాన్ని, అహంకారాన్ని ప్రదర్శించిందని ప్రచారం చేసిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు అంతకంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో నిర్భందాన్ని , అహంకారన్ని ప్రదర్శిస్తున్నారు. దానిలో భాగంగానే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సీటీకి చెందిన 400 ఎకరాల భూములని కర్పొరేట్‌ సంస్థలకు వేలం వేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత పది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలు చేస్తున్న విద్యార్థుల పట్ల అలాగే యూనివర్సీటీ భూములు తీసుకోవద్దని డిమాండ్‌ చేస్తున్న సమాజం పట్ల అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మత్రి శ్రీధర్‌ బాబు అత్యంత దురుత్సాహకరమైన రీతిలో వ్యవహరించి వాఖ్యలు చేశారు. ఈ రోజు ఆ నాలుగు వందల ఎకరాలలో ఏమీ లేదని నిరూపించుకోవటం కోసం అక్కడున్న ఫారెస్టును తొలగించి భూములన్నింటినీ హద్దులు లేకుండా చెరిపివేయాలే పేరుతో జీవవైవిద్యాన్ని దెబ్బతీసేందుకు, మొక్కలను తొలగించటం కోసం జేసీబీలను బుల్డోజర్లను తీసుకుని వచ్చారు. ఈ సందర్బంగా పోలీసు బలగాలను దింపి, బారీగేట్లను ఏర్పాటు చేయటంతో విద్యార్థులు తమ భూములను కాపాడుకోవటం కోసం ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసి సుమారు 60 మందికి పైగా రాయ్‌దుర్గ్‌, మాధాపూర్‌, గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. వారితో పాటు మరో 200 మందిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అత్యంత అవమానకరమైన ఘటన. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని ఎవరైనా వచ్చి ముఖ్యమత్రిని కలసి సమస్యలు చెప్పుకోవచ్చని అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్‌ రెడ్డి ఈ రోజు విద్యార్థులని చూడకుండా అమ్మాయిలని చూడకుండా, జుట్టు పట్టి మరి, గాయాలు చేసి, లాక్కుని పోయి, నిర్బందాన్ని ప్రయోగిసూ పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ వ్యాన్లలో ఎత్తేవేస్తూ అరెస్టు చేయటాన్ని ఎస్‌ఎఫ్‌ఐ, పి డి ఎస్ యు భద్రాచలం డివిజన్ కమిటీ తీవ్రంగా ఖండించాయి. ఈ చర్యలు చేయటమంటేనే ప్రజాస్వామ్యం లేకుండా రేవంత్‌ రెడ్డి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది. తక్షణమే ఈ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. యూనివర్సీటీలో దింపిన పోలీస్‌ బలగాలను వెనక్కి పిలిపించాలి. జేసీబీ, బుల్డోజర్లను అక్కడి నుండి ఖాళీ చేయించాలి. హెచ్‌సీయూకు చెందిన భూముల వేలాన్ని అపాలని ఎస్‌ఎఫ్‌ఐ, పి డి ఎస్ యు కోరుతుంది. అలాగే ఈ రోజు భద్రాచలం పట్టణంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ , రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. వేలం వేసిన భూముల సర్కులర్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో విద్యార్థుల తరపున ముఖ్యమత్రి ఇంటిని కూడా ముట్టడిస్తామని ఈ సందర్బంగా హెచ్చరిస్తున్నాము. ఈ ఘటనలనీ, నిర్బంధాలనీ, నియంతృత్వాన్ని ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు ఖండిరచాని ఎస్‌ఎఫ్‌ఐ, పి డి ఎస్ యు జిల్లా కమిటి కోరుతుంది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు నాయకులు మరియు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !