★రాష్ట్రంలో పోలీస్ అరాచకత్వం, దమనకాండ విచ్చల విడిగా పెరిగిపోయింది
★హెచ్సీయూలో అరెస్టులపై మండిపడ్డ పి డి ఎస్ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్
రాష్ట్రంలో ప్రభుత్వ అణచివేత విపరీతంగా పెరిగిపోయిందని ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత పి డి ఎస్ యు తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగూరి .వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
వందలాది ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సి టీ భూములను వేలం వేయడాన్ని నిరసిస్తూ ఆదివారం యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు విశాక్షణరైతంగా అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రామనరసయ్య విజ్ఞాన కేంద్రం నందు సోమవారం నిర్వహించిన పిడిఎస్ యూ ముఖ్యల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా పి డి ఎస్ యు తెలంగాణ రాష్ట్ర సహకార దర్శి వెంకటేష్ మాట్లాడుతూ…
రాష్ట్రంలో పోలీస్ అరాచకత్వం, దమనకాండ విచ్చల విడిగా పెరిగిపోయిందని, డానికి నిదర్శనమే శాంతియూతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను లాఠీ ఛార్జ్ చేయడం తో పాటు, బట్టలు చినిగెల ఇడ్చుకుంటూ విద్యార్థులను అరెస్టు చేయడమేఅని వారు పోలీస్ ల పై వారు మండిపడ్డారు.
ప్రభుత్వ విధానాలను నిరసించే ప్రతి గొంతునూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నొక్కుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో స్వేచ్చ, భావ ప్రకటన హక్కుని అణచి వేస్తున్న తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఈ విధంగా జరుగుతున్న అరాచకత్వానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని వెంకటేష్ రేవంత్ రెడ్డి ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ దేశంలోని ప్రతి పట్టణానికి వెళ్లి ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ గురిం చి ఉపన్యాసాలు ఇస్తారని, కానీ తెలంగాణలో తమ సొంత పార్టీ పాలనలో విద్యార్థుల పై జరుగుతున్న అరాచకత్వంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నిం చారు. ఈ ద్వంద్వ ప్రమాణాలను ఇప్పటికైనా పక్కన పెట్టి, ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజాస్వామిక పాలన చేసేలా తమ పార్టీ నాయకులకు రాహుల్ గాంధీ ఆదేశాలు ఇవ్వాలనిన్నారు. తక్షణమే అదుపులోకి తీసుకున్న విద్యార్థులను భేషరతుగా విడుదల చేయాలని, విద్యార్థులను విశాక్షణరైతంగా లాఠీ ఛార్జ్ చేసి అరెస్టు చేసిన పోలీసులు పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల జోలికి రావద్ద ని రేవంత్ రెడ్డి ప్రభుత్వన్ని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ ఖమ్మం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, జిల్లా నాయకులు వినయ్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి పృథ్వి, నగర కార్యదర్శి యశ్వంత్, నాయకులు నవీన్, నరేందర్, శ్రీ తేజ తదితరులు పాల్గొన్నారు.