హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో కార్పొరేట్ సంస్థల దాహం తీర్చేందుకే HCU భూముల వేలం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని పి డి యస్ యూ ఇల్లందు డివిజన్ కార్యదర్శి బానోత్ నరేందర్ అన్నారు.సోమవారం చండ్ర కృష్ణమూర్తి ట్రస్ట్ భవన్ లో పి డి యస్ యూ ముఖ్యుల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పుతోందని తక్షణమే హెచ్ సి యూ భూముల వేలం వేయడాన్ని విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తమ భావప్రకటన, స్వేచ్ఛ ను ప్రకటించుకునే హక్కు లేకుండా గొంతు నొక్కుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదివారం విశ్వవిద్యాలయంలోకి పోలీసులను పంపించి జేసిబి లతో భూమిని కబ్జా చేస్తుంటే అడ్డుకునేందుకు వెళ్లిన విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తించడం దాడి చేయడం జరిగిందని ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులపై లేడీ కానిస్టేబుల్ లేకుండానే వాళ్లను బ్రాండ్లలో చూసి అసభ్యకరంగా పోలీసులు ప్రవర్తించారని అన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న పి డి యస్ యూ హెచ్ సి యూ అధ్యక్షుడు నాగరాజు ను స్టూడెంట్ యూనియన్ నాయకులను,ఇతర విద్యార్థి సంఘాల నాయకులను, విశ్వవిద్యాలయ విద్యార్థులను అరెస్టు చేస్తే మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం హెయమైనా చర్య అని ఈ ఘటనను పి డి యస్ యూ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్ సి యూ భూముల కబ్జాను వెంటనే ఆపి వెనక్కి వెళ్లాలని లేనిపక్షంలో విద్యార్థులు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పి డి యస్ యూ ఇల్లందు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బి.సాయి,ఎ.పార్థసారథి, గంగాధర గణేష్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.
