దుమ్ముగూడెం మండలం పిరాయి గూడెం గ్రామంలో నిన్న ఆదివారం నాడు పిహాయ్ గూడెం లో జరిగిన అగ్ని ప్రమాదాలకు గురైన ఇల్లను ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లుదొర వారి బృందంతో సందర్శించి ఆ యొక్క కుటుంబ బాధితులను ధైర్యంగా ఉండాలని పరామర్శించారు అట్టి ప్రమాదం సంబావించి పూర్తిగా ఇల్లు కాలిపోయి కట్టు బట్టలు తప్ప ఏమి మిగలని పిరాయి గూడెం గ్రామస్తులైన ఆదివాసి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి అదేవిధంగా వారికి పక్క ఇందిరమ్మ ఇల్లు మెుదటి ప్రాదన్యదత కేటాయించాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్ చేయడం అయినది దాదపు 35 లక్షలు దాక నష్టం కలిగిందని మరియు ఏజెన్సీ మండలాలైన చర్ల దుమ్ముగూడెం ప్రధాన కూడలి కేంద్రం పర్ణశాల ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తూ దాదాపు దుమ్ముగూడెం మండలంలోని ఇప్పటివరకు ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని ముక్తకంఠంతో చెప్పారు ఈ యొక్క ప్రాంతంలో ఫైర్ స్టేషన్ అందుబాటులో ఉంటే ఇటువంటి ప్రమాదాలు జరిగిన ఎక్కువ ఆస్తి నష్టం జరిగే పరిస్థితి లేదని అన్నారు ఇటువంటి అగ్నిప్రమాదాలు విషయం అంశం మీద అగ్నిమాపక శాఖ వాళ్లకి సమాచారమిచ్చిన నిర్లక్ష్యం చేస్తూ ఏదోలే వాళ్ళు చెప్పారు మేము తీరుపాటయ్యాక వెళ్తాంలే అంటూ అగ్నిమాపక శాఖ వాళ్ళు వచ్చే పరిస్థితి ఉందని ఆ సందర్భాన్ని బట్టి ఆయన అన్నారు సరే అగ్నిమాపక శాఖ వాళ్ళ కోసం గంటల తరబడి వేచి చూసిన ఈ యొక్క ప్రమాదాన్ని సవరించే పరిస్థితి లేదు అందుబాటులో ఉండే పరిస్థితి లేదని ఇటు చూస్తే స్థానిక అధికారులు అందుబాటులో లేరు నిర్లక్ష్య సమాధానం చెప్పే పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న జరిగిన అగ్ని ప్రమాద ఆ యొక్క కుటుంబాలకు దాదాపు 35 లక్షలు దాకా ఆస్తి నష్టం జరిగిందని అదేవిధంగా ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంటే కాస్తయినా ఆస్తి నష్టం జరిగిపోయే పరిస్థితి లేదని అక్కడ పరిస్థితి చూసి ఆయన అన్నారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఫైర్ స్టేషన్ లేక ఫైర్ ఇంజన్ అందుబాటులో లేక ఈ ఏజెన్సీ ప్రాంతంలో కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు నిన్న జరిగిన అగ్ని ప్రమాదానికి గురైన ఆ యొక్క కుటుంబాలకు ఎటువంటి ఆధారాలు సౌకర్యం దక్కే పరిస్థితి ఉండలేదని అదే విధంగా ఆ యొక్క కుటుంబాలకి ఆధారాలు కానీ మరియు పోడు భూమి పట్టాలు రెవెన్యూ పట్టాలు పూర్తిగా అగ్ని ప్రమాదంలో కాలిపోయి వారికి మిగిలింది బూడిద కన్నీరే తప్ప ఏమి మిగలేదు కాబట్టి వాటికి రెవెన్యూ అధికారులు ఎటువంటి షరతులు పెట్టకుండా మరల వారికి ఆధారంగా ఇచ్చే విధంగా చేయాలనేసి డిమాండ్ చేశారు ఆదివాసి సంఘాల నుండి ఆదివాసి ఉద్యోగుల నుండి ఆ యొక్క ఆదివాసి కుటుంబాలకి కచ్చితంగా సహకారం ఉంటుందని ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ వాసుల ద్వారా బ్రతుకుతున్న వారు కచ్చితంగా ఆ యొక్క కుటుంబాలకి సహకరించాలి దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన మహిళా నాయకురాలు వాగే రాజేశ్వరి ఆదివాసి సంక్షేమ పరిషత్ దుమ్ముగూడెం మండల భద్రాచలం డివిజన్ నాయకులు కోరం వీరయ్య కోరం మురళి కారం నవీన్ పిరాయి గూడెం గ్రామ పెద్దలు









