నేటి గదర్ న్యూస్,పినపాక: గుండెపోటుతో ఎన్ఆర్ఈజీఎస్ కూలీ మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు….భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
పినపాక మండలం ఎడుళ్ళ బయ్యారం గ్రామంలో కీసర పెద్ద బ్రహ్మారెడ్డి(59) రోజు వారిలానే ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పనికి వెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలో బ్రహ్మారెడ్డి కి చాతి నొప్పి రాగ వెంటనే కుటుంబ సభ్యులు మణుగూరు ఏరియా హాస్పటల్ కి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో పెద్ద బ్రహ్మ రెడ్డి మృతదేహానికి కి పోస్టుమార్టం నిర్వహించారు. వడదెబ్బ సోకి మృతి చెంది ఉంటారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
మృతుడు బ్రహ్మారెడ్డి కుమారుడు కీసర సుధాకర్ రెడ్డి సీనియర్ రిపోర్టర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫోటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. బ్రహ్మ రెడ్డి అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.









