+91 95819 05907

జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్. మెదక్ జిల్లా చైర్మన్ గా బాలసాయి ప్రసాద్ ఎన్నిక

నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మే10.

జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ( నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్) మెదక్ జిల్లా చైర్మన్ గా బాలసాయి ప్రసాద్ కు నియామక పత్రం అందజేసినట్లు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎంవిఎల్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బాలసాయి ప్రసాద్ మాట్లాడుతూ తనకు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ చైర్మన్ గా నియమించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతాన్ పల్లి గ్రామానికి చెందిన బాలసాయి ప్రసాద్ నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ మెదక్ చైర్మన్ గా మారుమూల గ్రామ ప్రాంతం నుండి నియామకమయ్యారు. తనకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. తనకు మెదక్ జిల్లా చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన వ్యవస్థాపక జాతీయ చైర్మన్ డాక్టర్ ఎంవిఎల్ నాగేశ్వరరావు కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా చైర్మన్ గా తన ఎంపికకు సహకరించిన జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ పొట్టపెంజర రమేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ద్వారా వినియోగదారులు నేరుగా మార్కెట్లో పాల్గొనేలా చేయడంతో పాటు ప్రజా సంక్షేమాన్ని సాధించడానికి కృషి చేస్తామన్నారు. ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాలకు చెందిన అన్ని వస్తువులు, సేవలు, జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ పరిధిలోకి వస్తాయన్నారు. వినియోగదారుల హక్కులను అమలు చేయుటకు తయారీదారులు, వ్యాపారులు, విక్రేతలు, సేవల ప్రధాతల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటానికి జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ వినియోగదారుల చేతుల్లో ఒక ఆయుధం లాగా పనిచేస్తుందని మెదక్ జిల్లా వినియోగదారుల హక్కుల కమిషన్ చైర్మన్ గా ఎన్నికైన బాలసాయి ప్రసాద్ పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు.

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు. లొంగిపోయిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46

Read More »

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం : గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏమీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం

Read More »

ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుడిగాలి పర్యటన!

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికే లక్ష్యం: పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గం ఎమ్మెల్యే

Read More »

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

 Don't Miss this News !