రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 10:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని మెదక్ రోడ్ లో ఉన్న స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో 3వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఉచిత విద్య, ఉచిత హాస్టల్ సౌకర్యం, ప్రైవేట్ పాఠశాలలో మరియు ప్రైవేట్ కళాశాలలో చదివిపిస్తూ.సేవాభారతి దేశం మొత్తములో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.చిన్న వయస్సులోనే విద్యార్థులకు చదువు, సంస్కారం మరియు సత్పవర్తన వారి హృదయాలలో నింపి ఉత్తమ పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశ్యంతో స్వామి వివేకానంద అవాస విద్యాలయాన్ని 2006లో ప్రారంభించడం జరిగిందని ఆవాస విద్యాలయ ప్రధాన ఆచార్యులు తెలిపారు.అదేవిధంగా చక్కటి వసతి, భోజనం కల్పిస్తూ ఆటపాటలలో మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో శిక్షణ అందిస్తుందని పేర్కొన్నారు.2025-2026 విద్యా సంవత్సరం గాను ప్రవేశ పరీక్ష మే 25, 2025 ఆదివారం రోజున ఉదయం 11-30 గంటల నుండి 2 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ ప్రవేశ పరీక్షకు 3,4,5,6,7 తరగతుల విద్యార్థులు తెలుగు/మీడియం మరియు ఇంగ్లీష్/మీడియం నందు ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు.ప్రవేశ పరీక్షకు వచ్చే విద్యార్థులు ప్యాడ్, ఆధార్ కార్డు జిరాక్స్, ఒక పాస్ పోర్టు సైడ్ ఫోటో తీసుకొనిరాగలరు.ఎంపిక అయిన విద్యార్థులకు ఉచిత హాస్టల్ మరియు ప్రైవేటు పాఠశాలలో చదివిస్తామని పేర్కొన్నారు.ఎంపికైన విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ప్రతి రోజు ఉదయం,సాయంత్రం ఆవాసంలో ట్యూషన్ క్లాసులు,స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించబడతాయని పేర్కొన్నారు.దేశ శ్రేయస్సును కోరే ప్రతీ ఒక్కరు తల్లిదండ్రులు లేని పిల్లలను,తల్లి ఉండి తండ్రిలేక అలాగే తండ్రి ఉండి తల్లిలేని పిల్లలకు మరియు తల్లిదండ్రులు ఇద్దరు ఉండి కూడా బీదరికంలో ఉండే పిల్లలను ఆవాస విద్యాలయములో చేర్పిస్తే వారికి మంచి భవిష్యత్తును అందిస్తుందని తెలిపారు.చదువుకోవాలనే సంకల్పం ఉన్న ఆసక్తిగల విద్యార్థులు మిగతా వివరాల కోసం ఫోన్ 7386660483, 9989518920 నెంబర్లకు సంప్రదించవచ్చని వారు తెలియపరచారు.









