+91 95819 05907

గోల్పర్తి గ్రామంలో రేపటి నుండి శ్రీ పెద్దమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 10:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి గ్రామ శివారులో వెలసిన శ్రీ పెద్దమ్మ దేవాలయం మూడు రోజులపాటు జరిగే జాతర ఉత్సవాలకు ముస్తాబయింది.రేపటి ఆదివారం రోజు నుండి శ్రీ పెద్దమ్మ జాతర 8వ వార్షికోత్సవ జాతర ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి.ఉదయం 8 గంటలకు పుణ్యాహవచనము, రక్షాబంధనం,అఖండ దీపారాధన, గణపతి పూజ,నవగ్రహ మండప తీర్థ ప్రసాద కార్యక్రమాలు జరుగుతాయని గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు.అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు గ్రామ దేవతలకు బోనాల ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.సోమవారం రోజు ఉదయం 8 గంటలకు హోమం,ఉదయం 11 గంటలకు శ్రీ పెద్దమ్మ-పెద్దిరాజుల కళ్యాణం, మధ్యాహ్నం 1 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమము నిర్వహిస్తున్నట్టు,సాయంత్రం 5 గంటలకు పెద్దమ్మ బోనాలు ఊరేగింపు,ఒగ్గు కథ ఉంటుందని పేర్కొన్నారు.మంగళవారం రోజు ఉదయం 8 గంటలకు ఒగ్గు కథ,అమ్మవారికి పంచామృత అభిషేకం,తీర్థ ప్రసాద కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు బండ్ల ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని ఈ జాతర ఉత్సవాలకు శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు, పరమహంస పరివ్రాజాకచార్య, మరియు శ్రీ మదనానంద సరస్వతి స్వామి హాజరవుతున్నట్టు తెలిపారు.ఇట్టి జాతరకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పెద్దమ్మ జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు తెలియపరచారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు.

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు. లొంగిపోయిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46

Read More »

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం : గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏమీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం

Read More »

ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుడిగాలి పర్యటన!

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికే లక్ష్యం: పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గం ఎమ్మెల్యే

Read More »

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

 Don't Miss this News !