+91 95819 05907

త్రీటౌన్ ప్రాంతంలో చలివేంద్రాలను ప్రారంభించిన దేవకీ వాసుదేవరావు దంపతులు

నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:

ఖమ్మం నగరంలోని త్రీటౌన్ ప్రాంతంలో గల వ్యవసాయ మార్కెట్ వద్ద మరియు 33 వ డివిజన్ గాంధీ నగర్ లో స్వర్గీయ శ్రీ మువ్వల తులసి దాస్ జ్ఞాపకార్థం దేవకీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది . దానితోపాటు మజ్జిగ పంపిణీ కూడా చేయడం జరిగింది . మువ్వల తులసీదాసు గతంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పేద ప్రజల సమస్యలను తీర్చడంలో మరియు ఆర్యవైశ్య సంఘంలో కూడా ప్రముఖ పాత్రను పోషిస్తూ వ్యాపార సంఘంలో ఉన్నటువంటి సమస్యలను తీరుస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో వారి యొక్క పాత్రను పోషించడం జరిగింది . వారి యొక్క అకాల మరణం ఆర్యవైశ్యులను మరియు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలను కలచివేసింది . వారి యొక్క జ్ఞాపకాలను ఖమ్మం జిల్లా ప్రజలు ఇంకా మరిచిపోలేదు . వారి యొక్క సేవ గుణాన్ని అదేవిధంగా కొనసాగేలా వారి యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ వేసవికాలంలో ప్రజలకు ఎంతో కొంత సహాయం జరగాలని తీవ్రంగా ఉన్నటువంటి ఎండల నుండి ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రాలను దేవకి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దేవకీ వాసుదేవరావు దంపతులు ఏర్పాటు చేయడం జరిగింది . దేవకి ఫౌండేషన్ అధినేత శ్రీ దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ మువ్వల తులసీదాసు అకాల మరణం వ్యాపార వర్గాలలో మరియు ఖమ్మం జిల్లాలో ఒక దురదృష్టకరమైన సంఘటన అని తెలియజేయడం జరిగింది . ఆ రోజు నుండి వారికి తోచిన విధంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పేద ప్రజలకు పుస్తకాల పంపిణీ మరియు గతంలో ఖమ్మంలో మున్నేరు వరదలు సంభవించినప్పుడు తమ వంతుగా అనేక నిత్యావసర వస్తువులు మరియు దుప్పట్ల పంపిణీ దేవకి ఫౌండేషన్ ద్వారా అందచేయడం జరిగింది . అంతేకాకుండా వారు మున్ముందు రాబోయే రోజుల్లో కూడా వారి వంతుగా అనేక సేవా కార్యక్రమాలను ప్రజల కొరకు చేస్తానని తెలియజేయడం జరిగింది . ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి వారి యొక్క మిత్రబృందం మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు వారు ఇదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని వారికి భగవంతుడు అందుకు కావాల్సిన ఆర్థిక శక్తిని మరియు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ వారు మున్ముందు అనేక సేవా కార్యక్రమాలను చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు.

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు. లొంగిపోయిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46

Read More »

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం : గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏమీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం

Read More »

ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుడిగాలి పర్యటన!

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికే లక్ష్యం: పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గం ఎమ్మెల్యే

Read More »

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

 Don't Miss this News !