నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మే, 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, నాగుపల్లి గ్రామ పంచాయతీ లో ఉన్న నల్లివారిగూడెం గ్రామంలో ఆదివాసీ నాయకపోడు గ్రామ ప్రజలు అందరూ కలిసి నాగుపల్లి మెయిన్ రోడ్ పై ఆదివారం ధర్నా చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి రోడ్ లేక ఇబ్బంది పడుతున్నామని, అధికారులు స్పందించక పోవడం తో రోడ్డు ఎక్కి నిరసన తెలిపుతున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారు. వెంటనే గ్రామానికి రోడ్డు పోయాలని, రోడ్డు కి ఇరువైపుల స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ లో చోటు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్లు ఏ ఒక్కరికి కేటాయించ లేదని అర్హులైనా వారికి ఇళ్లు కేటాయించాలని, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయలని ధర్నా చేశారు. విషియం తెలుసుకున్న ఎమ్మెల్యే జారె ఫోన్ చేసి సమస్యలు పరిష్కారం చేస్తా అనడం తో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో వారికి మద్దతుగా తుడుం దెబ్బ నాయకులు తంబళ్ల రవి, బండారి సూర్యనారాయణ, నల్లివారి గూడెం గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు పాల్గొన్నారు.









