+91 95819 05907

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలోని మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కు వినతి పత్రం

నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:

ఖమ్మం లో తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు కలిసి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలోని మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందించారు . తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2000 మంది మీటర్ రీడింగ్ కార్మికులు పనిచేస్తున్నారని , ప్రభుత్వ సంస్థ అయిన విద్యుత్ సంస్థల్లో దాదాపు 23 సంవత్సరాల నుండి మీటర్ రీడింగ్ తీసే పనిని చేస్తూ సంస్థకు ఆదాయాన్ని సమకూరుస్తూ , అత్యంత ముఖ్యమైన విధులు నిర్వహించడం జరుగుతుందని , సంవత్సరాలుగా సదరు సంస్థలు మా సేవలను వినియోగించుకుంటున్నాయి కానీ మాకు తగిన న్యాయం చేయడం లేదని , తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు బాగుపడతాయని , తెలంగాణా రాష్ట్రం కోసం అన్ని సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని రకాల ఉద్యమాల్లో పాల్గొనడం జరిగిందని , గత ముఖ్యమంత్రి కి ఎన్నిసార్లు విన్నవించినా మా సమస్యలను ఏ మాత్రం ఖాతరు చేయలేదని , తెలంగాణా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిస్తూ బంగారు తెలంగాణాను సాధించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని , కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండి ఎంఎల్సీగా ఉన్న తమరు మా యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని భావిస్తున్నామని అన్నారు . పీసురేటు విధానం రద్దు చేయాలి , నెలవారీ పని దినాలు కల్పించి కనీస వేతనాలు ఇవ్వాలి , ఈపీఎఫ్ , ఈఎస్ఐ లతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి మా 2000 కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో టిజిఎన్ పి డి సి ఎల్ అధ్యక్షులు వెలిచేటి రాజా , రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి వీరయ్య , నాగేశ్వరావు , అనిల్ , మల్లేశ్వరరావు , వంశీ , నాగార్జున , బాలు , నరేష్ , నవీన్ , మధు తదితరులు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్

​పాత దరఖాస్తులకే దిక్కులేదు.. మళ్ళీ కొత్త నాటకాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 10: అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ

Read More »

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి

Read More »

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

 Don't Miss this News !