TG EAPCET-2025
ఫలితాల్లో… సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.
నేటి గదర్ న్యూస్, వైరా నియోజకవర్గ ప్రతినిధి :
గార్ల: ఈరోజు విడుదల చేసిన TG-2025 EAPCET ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న B.E/B.TECH కోర్సుల్లో ప్రవేశాల కోసం మే లో ఈ పరీక్షలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థులు
టి.శ్రీజ ర్యాంకు 23299, బి హారిక ర్యాంక్ 35912, కే రామ్ చరణ్ తేజ ర్యాంక్ 34075, బి భాను ప్రకాష్. ర్యాంక్ 124673, ఎండి అబ్దుల్ నజీర్ ర్యాంక్ 123751, జీ రేవంత్ కుమార్ ర్యాంక్,141103, జి సాగర్, ర్యాంక్ 142388, వై రాఘవి, ర్యాంక్ 139317, మీ పూజిత, ర్యాంకు147246, డి అరుణ్, ర్యాంకు 150882, డి అభిరామ్, ర్యాంక్ 149303, జీ రమేష్, ర్యాంక్ 140084 విద్యార్థులు ర్యాంక్లు సాధించారు. కాలేజీ ప్రిన్సిపల్ రాజకుమారి, పర్యవేక్షణలో మ్యాథమెటిక్స్ లెక్చరర్ చెన్నబోయిన సత్యనారాయణ,ఫిజిక్స్ లెక్చరర్ జి.సుజాత, కెమిస్ట్రీ లెక్చరర్ టీ.నాగేశ్వరావు లు నిరంతరం వారికి సూచనలు సలహాలు కావలసిన గైడెన్స్ అందిస్తూ, విద్యార్థులను ఎంతగానో ప్రోత్సహించారు. కాలేజీ ప్రిన్సిపల్ రాజకుమారి సైన్స్ & ఆర్ట్స్ ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ సిబ్బందిని , ర్యాంకు సాధించిన విద్యార్థులను అభినందించారు.









