నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మే, 11: దమ్మపేట మండలం, గండుగులపల్లి గ్రామం ఎమ్మెల్యే జారె క్యాంప్ కార్యాలయం (ఆఫీస్) లో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చేతులమీదుగా ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. ఒక్కరికి 100 116/- రూపాయలు, 28 మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే జారె మాట్లాడుతూ ఆకాశంలో సగం కాదు “ఆమే” ఆకాశం, సంక్షేమంలో సగం కాదు, ”ఆమే” అగ్రభాగం, మహిళా సంక్షేమంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన యావత్ భారత దేశానికే ఆదర్శం అని అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరుపదులు దాటిన అవ్వల వరకు అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అని మనసున్న మన రేవంతన్న కాంగ్రెస్ సర్కార్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహాసిల్దార్ టి వాణి, ఆర్ ఐ వీరాస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు చెక్కుల లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









