*కార్మికుల ప్రాణాలకు హానికరంగా ఉన్న తేనె టీగల తెట్లు తొలగింపు పట్ల మణుగూరు టి బి జి కె యస్ హర్షం నాగెల్లి ____
మణుగూరు సింగరేణి ఏరియా ఏజెంట్ అఫీస్ ఎదురుగా ఉన్న ఫిల్టర్ బేడ్, బేస్ వర్క్ షాప్ మరియు ఓసీ 4 మైన్ దగ్గర విపరీతమైన తేనె టీగల తెట్లు ఉన్నాయనీ విధులు నిర్వహించే ప్రదేశాలలో తేనె టీగల తెట్లు ఉండడం వల్ల కార్మికులు భయాందోళనకు గురి అవుతున్నారని వాటి వల్ల పలు మార్లు కార్మికుల పై జరిగిన దాడి ఘటనలు గాయపడిన తీరు తెన్నులను ఓ. సి 2 రక్షణ అధికారి లింగబాబు కు ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వివరించారు వాటిని త్వరితగతిన తొలగించాలని ఆయన తెలియచేశారు.కార్మిక రక్షణ అరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మీపతి గౌడ్ దగ్గర ప్రత్యేక అనుమతి తీసుకున్న రక్షణ అధికారి లింగబాబు మంగళ వారం నాడు తేనె టీగల తెట్లు తొలగింపు కు చర్యలు చేపట్టడం అభినందనీయమైన అంశం అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.. టి బి జి కె యస్ చేసిన విజ్ఞప్తి పై స్పందించి తేనె టీగల తెట్లు తొలగింపు కు ఆదేశాలు ఇచ్చిన ఓసీ 2 ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మీ పతి గౌడ్ కు, ఓసీ 2 రక్షణ అధికారి లింగబాబు కు తోడ్పాటు అందించిన కార్తీక్ ఓర్ మెన్ కు మణుగూరు ఏరియా టి బి జి కె యస్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. తేనె టీగల తెట్లు తొలగింపు కు అనుభవం కలిగిన వారిని ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా రప్పించి సహాయ సహకారాలు అందించిన ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి కి పలువురు ఓ. సి 2 అధికారులు, ఉద్యోగులు, కార్మికులు అభినందించారు*









