నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా, ఇనుగుర్తికి చెందిన కుంచాల పుల్లయ్య కుమారుడు లక్ష్మణ్ రాజ్ బ్రెయిన్ సర్జరీ కోసం అవసరమైన 2 లక్షల రూపాయల ఏల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ని ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు.ఆయన అనారోగ్యానికి గురైనట్లు తెలిసిన వెంటనే ఎంపీ రవిచంద్ర నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా డైరెక్టర్ డాక్టర్ బీరప్పకు ఫోన్ చేసి చెప్పారు.బీరప్ప సూచనతో ఎంపీ రవిచంద్ర 2 లక్షల రూపాయల ఏల్వోసీ మంజూరు చేయించి తన పీఏ ధనుంజయ్ ద్వారా అందుకు సంబంధించిన పత్రాన్ని మంగళవారం లక్ష్మణ్ రాజు భార్య జ్యోతికి అందజేశారు.
Post Views: 66









