రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 13:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహానికి సంబంధించిన వివరాలను రామాయంపేట సీఐ వెంకట రాజాగౌడ్ వెల్లడించారు.వికలాంగురాలైన మహిళను గుర్తు తెలియని దుండగులు బండరాయితో మోది హత్య చేశారని తెలిపారు.మృతురాలు రెండు కాళ్లు అంగవైకల్యం కలిగి ఉన్నాయని,కుడి చేయిపై రజిత,ఎడమ చేయిపై మహేష్ అని పచ్చబొట్టు వేసుకోని ఉందన్నారు.మహిళ పసుపు రంగు చీర,ఆరెంజ్ కలర్ జాకెట్,ఎరుపు రంగు గాజులు కలిగి ఉందని పేర్కొన్నారు.ఈ మహిళ వయస్సు అందాజా 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందని మహిళా మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే రామాయంపేట పోలీసులకు ఫోన్ 8712657933, 8712657934 నెంబర్లకు వెంటనే సమాచారం అందించాలని తెలియపరచారు.
Post Views: 180









