తొనిగండ్ల గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళ దారుణ హత్య
రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 13:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో మంగళవారం నాడు ఉదయం ఓ మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు రామాయంపేట పోలీసులకు సమాచారం అందించారు.ఈ విషయం తెలుసుకున్న రామాయంపేట ఎస్సై బాలరాజ్ పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మహిళ మృతదేహాన్ని గమనించి అన్ని కోణాలో పరిశీలించారు.మహిళ హత్య ఏ విధంగా జరిగిందనే విషయాలను ఎస్సైని అడిగి తెలుసుకున్నారు.మహిళను దుండగులు తలపై బండరాయితో కొట్టి హత్య చేసి పడేశారని తెలిపారు.అంగవైకల్యం గల మహిళను ఎవరైనా ఎక్కడైనా హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి మృతదేహాన్ని వదిలి వెళ్లారా లేదా ఇక్కడే మహిళను బండరాయితో మోది హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రామాయంపేట ఎస్సై బాలరాజ్ తెలిపారు.









