*భారీగా బుల్లెట్స్ లభ్యం..!!*
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసిబి అధికారులు సోదాలు చేశారు. *హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ లోని ఆయన నివాసంతో పాటు మరికొన్నిచోట్ల దాడులు నిర్వహించారు.* ఇంట్లో *అక్రమంగా ఉన్న 25 లైవ్ బుల్లెట్స్, 65 యూస్డ్ బుల్లెటు లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.* బుల్లెట్స్ అక్రమ నిల్వపై హయత్ నగర్ పోలీసులకు ఏసీబీ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో డిఎస్పీ పార్థసారధిపై హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లోనూ కేసు నమోదైంది. *పార్థసారథి ఇంట్లో భారీగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను గుర్తించారు.* నిన్నటి రోజు
సోమవారం సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో రెండున్నర గంటల పాటు ఆయనను విచారణ చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట టౌన్, సూర్యాపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారి *ఫిర్యాదుదారుడి నుండి రూ.25 లక్షలు డిమాండ్ చేసి రూ.16 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు* ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన పిటిషన్ మేరకు విచారణ చేసి *సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ సీఐ రాఘవులుపై కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు…*









