మనువాద కార్పొరేట్ విధానాలపై కార్మిక వర్గంతో కలిసి నడవాలి.
కెవిపిఎస్ రౌండ్ టేబుల్ సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు పిలుపు.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
మే 20న జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలని మనువాద కార్పొరేట్ విధానాలను అమలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని బిజెపి విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు . బుధవారం ఖమ్మం ఎన్ ఎస్ పి క్యాంపు లోని మంచికంటి ఫంక్షన్ హాల్ లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో మే 20 సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా సామాజిక సంఘాలచే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు . ఈ సమావేశానికి కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ అధ్యక్షత వహించారు . వివిధ సామాజిక ప్రజా సంఘాల నాయకులు ప్రసంగించారు . అనంతరం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులను కూడా రక్షణ కరువైందన్నారు .11 ఏళ్ల మనువాద బిజెపి విధానాలు అట్టడుగు పేదల జీవితాలను మరింతగా దుర్భరం చేశాయన్నారు . దేశంలో 200 మంది కోటీశ్వరులు ఆస్తులు దేశంలో 40 శాతం మంది ప్రజల ఆస్థితో సమానమైందన్నారు . మరో వైపున 40కోట్ల మంది మన భారతీయులు దారిద్య్రరేఖకు దిగువన వున్నారని చెప్పారు . బిజెపి విధానాలు కార్పొరేట్ దిగ్గజాలకు వరాలు కురిపిస్తూ కష్టజీవులపై భారాలు వేస్తుందన్నారు . స్వాతంత్రం కంటే ముందు నుండి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న
29 కార్మిక చట్టాలను బీజేపీ సర్కార్ రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చిందన్నారు . రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్19 ప్రకారం సంఘం పెట్టుకునే హక్కు , సమ్మె చేసే హక్కు , కనీస వేతనం పొందే హక్కులనుండి కార్మికులను దూరం చేస్తుందన్నారు . తన మతోన్మాద కార్పొరేట్ విధానాలతో రాజ్యాంగ విరుద్ధంగా కార్మిక హక్కులను కాలరాస్తుందన్నారు . కార్మికుల శ్రమను దోచి కార్పొరేట్ దిగ్గజాలకు దాచిపెడుతుందన్నారు . అంబానీ ఆదాని లాంటి అపర కుబేరుల ప్రయోజనాలే దేశ ప్రయోజనాలుగా చూస్తుందన్నారు . నూటికి 80శాతం మంది దళితులు గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో జాబు కార్డులు కలిగి ఉండి ఉపాధి కోసం రోజువారి పనికి వెళ్తున్నారని , దళితులకు ఆ ఉపాధికూడా లేకుండా చేయటానికి కేంద్ర బిజెపి సర్కార్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు . 80 కోట్ల మంది ప్రజలకు ఉపాధి నిచ్చే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్ లో కేవలం 86వేలకోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిందన్నారు . ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బిజెపి సర్కార్ 11 ఏళ్ల కాలంలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా , ఉన్న ఉద్యోగాలను తొలగించిందన్నారు . ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం ద్వారా సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తుందన్నారు . 15% ఉన్న ప్రైవేటు రంగం నేడు 85 శాతానికి పెరిగితే 85% ఉన్న ప్రభుత్వ రంగం 15 శాతానికి దిగజార్చిందన్నారు . ఫలితంగా అట్టడుగు వర్గాలు రాజ్యాంగబద్ధంగా కల్పించబడ్డ రిజర్వేషన్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేకపోవడంతో అట్టడుగు వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు . ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలనే ఒక సామాజిక న్యాయ డిమాండ్ కోసం అట్టడుగు వర్గాలు ఐక్యం కావలసిన ఆవశ్యకత ఉందన్నారు . బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై 300 రేట్లు దౌర్జన్యాలు పెరిగాయని బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రత్యేకించి దళితులను టార్గెట్ చేసుకొని మూక దాడులు జరుగుతున్నాయని చెప్పారు . ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారంగా జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించలేదన్నారు . 20 శాతం ఉన్న దళితులకు కేవలం ఐదు శాతం మాత్రమే బడ్జెట్లో నిధులు కేటాయించారని చెప్పారు . దేశవ్యాప్తంగా సుమారు 6 లక్షల బ్యాక్ లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్న ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు . రాజ్యాంగాన్ని రక్షించుకోవడం. ప్రభుత్వ రంగ సంస్థలను , రిజర్వేషన్లను కాపాడుకుంటూనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు . ఆ వెలుగులో కార్మిక సంఘాలు తలపెట్టిన జాతీయస్థాయి సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులుగా సమైక్యంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక విశ్లేషకులు డాక్టర్ బి.వి రాఘవులు , మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కోరిపల్లి శ్రీనివాస్ , సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణు , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ , జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీనివాసరావు , జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి టి లింగయ్య , కేజీకేఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోడపట్ల సుదర్శన్ , గాలి అంజయ్యn, మత్స్య కార్మిక సంఘం జిల్లా నాయకులు పగడాల నాగేశ్వరరావు , ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు పి. సుధాకర్ , కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్ , నాయకులు కొమ్ము శ్రీను , పాపిట్ల సత్యనారాయణ , బొట్ల సాగర్ , ఎస్ కె సైదులు , నోముల పుల్లయ్య , కిరణ్ , శాంతయ్య , వీరభద్రం , పగిడిపల్లి వెంకట్రావు , ఉప్పలయ్య , ఆర్ ప్రకాష్ , డేవిడ్ రాజు , ఇటికాల లత , బాబు , కొండం కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు .









