+91 95819 05907

రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌తో భేటీ అయిన రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి.

* గ‌వ‌ర్న‌ర్ ద‌త్త‌త తీసుకున్న గ్రామాల్లో కూడా ఇందిర‌మ్మ ఇళ్లు
* భూభార‌తి అమ‌లుపై వివరణ.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.

హైద‌రాబాద్: రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శ్రీ జిష్ణుదేవ్ వ‌ర్మతో రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి బుధ‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన భూ భార‌తి చ‌ట్టం అమ‌లు, మ‌రియు ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థకం గురించి స‌వివ‌రంగా వివ‌రించారు. ఈ ఏడాది ప్ర‌తినియోజ‌క‌వ‌ర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 ల‌క్ష‌ల ఇండ్ల‌ను మంజూరు చేస్తున్నామ‌ని వివ‌రించారు.
* గ‌వ‌ర్న‌ర్ ఆలోచన, ముఖ్యమంత్రి సూచ‌న‌ల మేర‌కు గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గాల‌కు అద‌నంగా 500 నుంచి 700 ఇళ్లను మంజూరు చేస్తున్నామ‌ని, ఐటీడీఏ ప‌రిధిలో చెంచు కుటుంబాల‌కు ప‌దివేల ఇండ్ల‌ను మంజూరు చేస్తున్నామ‌ని, మొద‌టి ద‌శ‌లో అత్యంత నిరుపేద‌ల‌కు ప్రాధాన్య‌తాక్ర‌మంలో కేటాయిస్తామని వివరించారు.
* గ‌వ‌ర్న‌ర్ ద‌త్త‌త తీసుకున్న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని పూసుకుంట, గోగులపూడి గ్రామాలు, ఆదిలాబాద్ జిల్లా భుర్కి, మంగ్లీ , నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అప్పాపూర్ , బౌరాపూర్ గ్రామాల్లో కూడా ఇందిర‌మ్మ ఇళ్లను మంజూరు చేశామ‌ని తెలిపారు.
* రాష్ట్రంలో గ‌త ప‌దేళ్లుగా నెల‌కొన్న భూస‌మ‌స్య‌లకు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించాల‌న్న ల‌క్ష్యంతో తీసుకువ‌చ్చిన భూభార‌తి చ‌ట్టాన్ని గ‌త నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని నాలుగు మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా
అమ‌లు చేశామ‌ని, ఈనెల 5వ తేదీ నుంచి 28 మండ‌లాల్లో అమ‌లు చేస్తున్నామ‌ని వివ‌రించారు. ఎలాంటి రుసుము లేకుండానే ప్ర‌జ‌ల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. గ‌వ‌ర్న‌ర్ గారిని క‌లిసిన వారిలో ఐడీసీ చైర్మ‌న్ మువ్వా విజ‌య‌బాబు, హౌసింగ్ కార్పొరేష‌న్ ఎండీ వీపీ.గౌత‌మ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం : గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏమీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం

Read More »

ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుడిగాలి పర్యటన!

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికే లక్ష్యం: పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గం ఎమ్మెల్యే

Read More »

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

 Don't Miss this News !