196 సర్వే భూమి అటు అసైన్ ఎటు సీలింగ్ కాదు_
పక్కా పట్టా భూమి : బాధితుల ఆవేదన
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్
(ఖమ్మం) జూన్ 14 : జిల్లా కేంద్రం ఖమ్మం నగరంకు సమీపంలోని రఘునాధపాలెం మండల పరిధిలో గల మల్లెమడుగు రెవెన్యూ సర్వేనెంబర్ 196 లో ప్లాట్లను చేసిన భూమి అటు అసైన్ ఇటూ సీలింగ్ కాదు ఇది పక్కా పట్టాభూమి అంటూ ప్లాట్ల బాధితులైన కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 196 సర్వే నెంబర్ లో సుమారు 138 మంది 2008లో ప్లాట్లను కొనుగోలు చేశారు. ప్లాట్ లలో హద్దు రాళ్లు ఏర్పాటైన అనంతరం ఆ ప్లాట్ లను తమ పిల్లలకు దార దత్తం చేసేందుకు కొనుగోలు చేసిన వాళ్లంతా రిజిస్టర్ సైతం చేయించారు. నేడు రేపు ఆ ప్లాట్ లలో నిర్మాణాలు చేద్దామనుకుంటే హఠాత్తుగా గత నెల 24 తేదీన రాత్రి బానోతు ప్రవీణ్ కుమార్, బానోతు ప్రశాంత్ కుమార్ ,బానోతు సక్కుబాయి లతోపాటు వారి ఆలోచనలు ప్లాట్ల హద్దురాళ్ళను పీకి ,రోడ్డును జెసిబితో చదును చేశారు. రెండో రోజు విషయాన్నీ గమనించిన బాధితులంతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించారు. ఖమ్మం నగరం తో పాటు మండలంలో పెరుగుతున్న భూ అక్రమ దారుల ఆగడాలు శృతిమించి పోతున్నాయని ఈ సందర్భంగా బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంచర్ల నుండి ప్లాట్లను కొనుగోలు చేసిన , వాటిని రిజిస్టర్ కూడా చేయించుకున్న భూ కబ్జాదారులు వీటి మీద కూడా కన్ను వేయడమంటే దారుణం మరొకటి లేదన్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉండాలని ఉద్దేశంతో ప్లాట్లను కొనుగోలు చేస్తే కొంతమంది ఈ విధంగా ఆకృత్యానికి పాల్పడటం అది కూడా జిల్లా కేంద్రం సమీపంలోనే ఇలాంటి సం ఘటన జరగటం పై ఇప్పటివరకు ఎవరు కూడా స్పందించకపోవడం పట్ల బాధితులు ఆందోళన , అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఇలాంటి ఆసాంఘిక శక్తులు జిల్లా కేంద్రం సమీపంలోనే సంచరించటం సిగ్గుచేటుగా ఉందన్నారు. ఈ 196 సర్వే లో భూమి కు సంబంధించిన అనేక లింకు డాక్యుమెంట్లు , రిజిస్టర్ అయినటువంటి దస్తావేజులు ప్రత్యక్ష సాక్ష్యంగా ఉండగా ఈ నిందితులు ఈవిధమైన దౌర్జన్యం చేయడం అంటే శాంతి భద్రతలు జిల్లాలో ఎలా అమలు అవుతున్నాయో అన్నదానికి తార్కాణంగా నిలుస్తాయని బాధితులు వాపోతున్నారు. మంత్రులు , జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి , సానుకూలంగా స్పందించి , తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది ఎల్ ఆర్ ఎస్ చేసుకోగా మరి కొంతమంది ఇంటి నిర్మాణాలకు అనుమతులు కూడా తెచ్చుకున్నారు. కాగా ఈ ప్లాట్ల మధ్యలో నుండి జాతీయ రహదారి వెళ్లనుంది. వీటి మధ్యలో ఈ ఉదంతం. ఏమి పాలు పోనీ స్థితిలో బాధితులు అయోమయంలో ఉన్నారు.