రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి
-అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి
-కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి
నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి):
ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి అరకదున్ని.. విత్తనాలు జల్లాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమితంగా ప్రేమించే పాలేరు నియోజకవర్గ రైతన్నలు ఏర్పాటు చేసుకున్న ఏరువాక సాగు కార్యక్రమంలో అరక పట్టి, దుక్కిదున్ని, రైతులతో కలిసి విత్తనాలు నాటడం సంతోషాన్నిచ్చింది అని అన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రైతు ను రాజు చేయాలనేదే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయిన ప్రభుత్వం రైతులను ప్రోత్సాహిస్తోందని,ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రైతులకు రూ.17000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే,కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో నే రూ. 21వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్త శుద్ది తో పని చేస్తోంది అని అన్నారు.నాణ్యమైన విత్తనాలు,ఎరువులు ఇబ్బంది లేకుండా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గత ప్రభుత్వం వారి స్వార్థం కోసం ప్రాజెక్టులు మొదలు పెట్టి అర్ధాంతరంగా వదిలేస్తే వాటిని పూర్తి చేస్తూ సాగు నీటిని అందిస్తాం అని అన్నారు.వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి పెట్టుబడి కోసం 12 వేలు ఇస్తాం…రైతు భరోసా ఇప్పటికే రెండు సార్లు ఇచ్చాం, రేపటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం అని మంత్రి తెలిపారు.కాళేశ్వరం కూలినా కూడా దేశంలో అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా మనం మొదటి స్థానంలో ఉన్నాం.ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోందని , ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం అని మంత్రి అన్నారు.









