నేటి గదర్ న్యూస్,
చింతకాని ప్రతినిధి.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర నియోజకవర్గ శాసన సభ్యులు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు మడుపల్లి భాస్కర్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఉద్దేశించి మాట్లాడుతూ. ఎన్నో ఏళ్లుగా తమ పోరాటం ప్రజలపై ప్రేమ ఆదరణ పొందిన మహా నాయకుడు దళిత బిడ్డ పేదల ప్రక్షాళన పోరాడుతూ ప్రతి పేదోడి కష్టసుఖాలను పాలుపంచుకుంటూ ప్రజా లక్ష్యంగా నిరంతర శ్రామికుడిగా కృషి చేస్తూ అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజా మన్నలను పొందుతూ ప్రతి పేదోడి కన్నీటి బొట్టును తుడిచే మహనీయుడు తన పయనం అడుగులు కోట్లాది ప్రజల ఆశా కిరణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీ హామీలను నెరవేరుస్తూ ప్రజల లక్ష్యమే తన లక్ష్యంగా భావిస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినటువంటి మహనీయులు మల్లు భట్టి విక్రమార్గారికి ఇదే మా జన్మదిన శుభాకాంక్షలు అని తెలియజేస్తూ అంబరాన్నంటిన సంబరాలు అంగరంగ వైభవంగా జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కన్నేబోయిన గోపి , చింతకాని కాంగ్రెస్ ఎస్సీ సేల్ అధ్యక్షులు వనం చిన్నప్ప, చింతకాని గ్రామ శాఖ అధ్యక్షులు ఎస్.కె అబ్దుల్ మజీద్ , శ్రీ కొప్పల గోవిందరావు జిల్లా ఆత్మ అడ్వైజర్ కమిటీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు చింతకాని గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.