+91 95819 05907

డ్రైనేజీ ని ఆక్రమించి దర్జాగా హోటల్ వ్యాపారం

★ వాహన దారులకు ఇక్కట్లు

★పోలీసు ,పంచాయతీ, ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవాలి

పినపాక, సెప్టెంబర్ 16:

ఆ హోటల్ నిర్వాహకుడి ఇష్టారాజ్యం… ఆడిందే ఆట పాడిందే పాటలా ఉంది. తనకు అడ్డు ఎవరూ లేరన్నట్టుగా డ్రైనేజీ ని ఆక్రమించుకుని హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు లాగా సాగుతున్న… వాహనదారులు, పాదాచారులు అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ నాకేమీ పట్టదు అన్నట్లుగా హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అక్రమంగా ప్రభుత్వ డ్రైనేజీ ఆక్రమించి హోటల్ వ్యవహారం నిర్వహిస్తున్న అక్రమార్కుని పై ప్రజా జ్యోతి కథనం…

పినపాక మండలం… ఏడుళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లో పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఓ హోటల్ నిర్వాకుడు ప్రభుత్వ డ్రైనేజీని అక్రమంగా ఆక్రమించి గత కొన్ని సంవత్సరాలుగా హోటల్ నిర్వహిస్తున్నాడు. పంచాయతీ సిబ్బందికి డ్రైనేజీ శుభ్రం చేయడం ఇబ్బందిగా మారింది. దీనితో అక్కడ దుర్వాసన రావడం జరుగుతుందని పలువురు కస్టమర్లు వాపోయారు. అలాగే హోటల్ ఎదురుగా వాహనాలు పార్కింగ్ చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే ఎక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటాయోనని ప్రధాన రహదారిపై వెళ్లే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంతా జరుగుతున్న పంచాయతీ ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినబడుతున్నాయి. ఇప్పటికైనా పోలీసు, పంచాయతీ, ఆర్ అండ్ బి అధికారులు దృష్టి సారించి అక్రమంగా డ్రైనేజీ ఆక్రమించిన హోటల్ నిర్వాహకునిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఎంపీఓ వెంకటేశ్వరరావు వివరణ: డ్రైనేజీ ఆక్రమణ విషయమై ఎంపీఓ వెంకటేశ్వరరావును ప్రజా జ్యోతి వివరణ కోరింది. డ్రైనేజీ ఆక్రమణ పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !