విద్యుత్ శాఖకు చెందిన ఓ ఏడీఈ బంధువు నివాసంలో రూ. 2.00 కోట్ల నగదును ఏసీబీ అధికారులు గుర్తించిన ఘటన ఇది. హైదరాబాద్ లోని ఇబ్రహీంబాగ్ లో విద్యుత్ శాఖ ఏడీఈగా పనిచేస్తున్న అంబేడ్కర్ నివాసంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు ప్రారంభించారు. ఉదయం నుంచి కొనసాగుతున్న దాడుల్లో భాగంగా అంబేడ్కర్ కుటుంబ సభ్యుల, బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు అంబేడ్కర్ బంధువు ఒకరి ఇంట్లో అధికారుల తనిఖీల సందర్భంగా రూ. 2.00 కోట్ల నగదుకు సంబంధించిన కట్టలు పట్టుబడడం గమనార్హం. ఏడీఈ భారీగా ఆస్తులు పోగేసుకున్నట్లు గుర్తించిన అధికారులు తనిఖీల్లో ఇప్పటి వరకు ఆయనకు మూడు ప్లాట్లు, గచ్చబౌలిలో ఖరీదైన భవనం ఉన్నట్లు కనుగొన్నారు. అంబేడ్కర్ ఆస్తులకు సంబంధించి ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారవర్గాలు చెప్పాయి.
Post Views: 167









