ప్రజల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఆర్‌అండ్‌బీ డీఈ విశ్వనాథ్
నేటి గద్దర్ న్యూస్,ములకలపల్లి, సెప్టెంబర్ 16: ములకలపల్లి నుంచి ఆర్లపెంట వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు గుంతలను పూడ్చి, మరమ్మతులు చేయించినందుకు మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి ఆర్‌అండ్‌బీ డీఈ విశ్వనాథ్ కి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలకు ప్రమాదాలు జరగకుండా రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గత నెల 28న తాను డీఈ విశ్వనాథ్ కి ఫోన్ చేసి విజ్ఞప్తి చేశానని నాగమణి గుర్తు చేశారు. ఆ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన డీఈ, మంగళవారం నుంచి రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చించే పనులు ప్రారంభించారని ఆమె పేర్కొన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిచ్చినందుకు ఆమె అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Post Views: 155









