తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ , మోకు దెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నరస గౌడ్ అక్రమ అరెస్టుకు నిరసన.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిది
ఖమ్మం : అంబేద్కర్ సెంటర్ లో మోకు దెబ్బ జిల్లా అధ్యక్షులు బండి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ , మోకు దెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నరస గౌడ్ అక్రమ అరెస్టును ఖండిస్తూ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు . నిజామాబాద్ జిల్లాలో తాళ్ల రాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులపై వీడీసీ జరిపిన దాడి పై స్పందించిన మోకు దెబ్బ జాతీయ అధ్యక్షులు , తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమర వేణి నర్సాగౌడ్ ను అతని నివాసానికి వెళ్లి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం హేమమైన చర్య . వీడీసీ పై చర్యలు తీసుకోకుండా అన్యాయం జరిగిందని . సమస్యపై స్పందించిన నాయకులను వేధించడం ఏమిటని ప్రశ్నించే గొంతుకులను అణచివేయడం, అక్రమ కేసులు బనాయించడం హేమమైన చర్య అన్నారు . గౌడ సంఘాలకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతుకులా తన వానిని వినిపించే అమరవేణి నర్సాగౌడ్ పై కవ్వింపు చర్యలకు దిగడం చాలా బాధాకరం . ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బండి నాగేశ్వరావు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకులను అణచివేయాలని చూస్తే ఇలాంటి ఉద్యమాలు మరెన్నో ఉవ్వెత్తున లేస్తాయని హెచ్చరించారు . ఖమ్మం జిల్లాలోనే కాదు , తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా గౌడ బిడ్డలకు అన్యాయం జరుగుతుందంటే అక్కడ మోకు దెబ్బ ప్రశ్నిస్తూనే ఉంటుంది . ఇలాంటి కవ్వింపు చర్యలకు భయపడే వ్యక్తులము కాదన్నారు . వెంటనే నర్సా గౌడ్ పై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి ( మోకు దెబ్బ) రాష్ట్ర యువజన అధ్యక్షులు పంది రాజు గౌడ్ , ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మరికంటి వెంకట్ గౌడ్ , జిల్లా యూత్ అధ్యక్షులు బాలబోయిన వీరబాబు గౌడ్ , ఉపాధ్యక్షులు పోల గాని నాగరాజుగౌడ్ , మోకు దెబ్బ ఉపాధ్యక్షులు గడ్డం ఉపేందర్ గౌడ్ , ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దావా ముత్యాలరావు గౌడ్ , ఖమ్మం జిల్లా మహిళా నాయకురాలు వట్టికూటి ఉమాదేవి గౌడ్ , మరికంటి గోపీనాథ్ గౌడ్ , జిల్లా ఉపాధ్యక్షులు పంది శ్రీనివాస్ గౌడ్ , రఘునాధపాలెం అధ్యక్షులు గుణగంటి రామారావు గౌడ్ , బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు పడకండి రాంబాబు తదితర గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు .









