బుధవారం కొత్తగూడెం, ములకలపల్లి, దమ్మపేటలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న నేతలు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 16: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బుధవారం (సెప్టెంబర్ 17) వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ వేడుకలతో ప్రారంభమై, హెల్త్ క్యాంపులు, పాఠశాలల సందర్శనలతో వారి పర్యటన కొనసాగనుంది. పర్యటన వివరాలు: ఉదయం 8:00 గంటలకు అశ్వారావుపేటలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విమోచన దినోత్సవం వేడుకల్లో పాల్గొంటారు. ఉదయం 10:00 గంటలకు కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో జరగనున్న విమోచన దినోత్సవ వేడుకల్లో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే ఆదినారాయణ ఇద్దరూ పాల్గొంటారు. ఉదయం 11:00 గంటలకు మంగపేట-ములకలపల్లిలో డిస్ట్రిక్ట్ లెవెల్ హెల్త్ క్యాంపులో పాల్గొంటారు. ఉదయం 11:30 గంటలకు మూకమామిడి-ములకలపల్లిలో జరిగే హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:00 గంటలకు గండుగులపల్లి-దమ్మపేటలోని ఏకలవ్య స్కూల్ మరియు కాలేజీని సందర్శిస్తారు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గ నాయకులు, మండల అధికారులు, వివిధ విభాగాల అధ్యక్షులు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ వట్టి వెంకట్రావు కోరారు.









