బాయ్స్ హాస్టల్, స్టాఫ్ క్వార్టర్స్‌కు శంకుస్థాపన చేయనున్న మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే ఆదినారాయణ
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, సెప్టెంబర్, 16: దమ్మపేట మండలం, గండుగులపల్లిలోని ఏకలవ్య పాఠశాలలో బాయ్స్ హాస్టల్, స్టాఫ్ క్వార్టర్స్‌ల నిర్మాణానికి బుధవారం (సెప్టెంబర్ 17న) మధ్యాహ్నం 1 గంటలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు అశ్వారావుపేట నియోజకవర్గ శాసన సభ్యులు జారె ఆదినారాయణ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ అధ్యక్షులు, సోషల్ మీడియా, పార్టీ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ మరియు ఇతర అనుబంధ సంఘాల నాయకులను ధమ్మపేట మండల అధ్యక్షులు మద్దిశెట్టి సత్యప్రసాద్ కోరారు. ఈ నిర్మాణాలు పూర్తయితే విద్యార్థులకు, సిబ్బందికి మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.









