ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి, ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నేతలు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 17: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయనకు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తోడుగా ఉన్నారు. ముందుగా, మంత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి జెండా వందనం చేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి మండలం మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్‌లో పాల్గొన్నారు. అదేవిధంగా, మూకమామిడి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో కొత్తగా నిర్మించనున్న కాంపౌండ్ వాల్, స్టాఫ్ రూమ్స్, బాయ్స్ హాస్టల్, అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. అడ్వాంటా కంపెనీ వారు అందించిన కంప్యూటర్ ల్యాబ్, మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించి, కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు. పట్వారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టేబుల్ టెన్నిస్ యూనిట్‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా అంగన్‌వాడీ టీచర్లకు కొత్త వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమాలలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో బి. రాహుల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా వైద్యాధికారిణి జయలక్ష్మి, జిల్లా పరిపాలన అధికారి విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీసీహెచ్ఓ రఘుబాబు, డీఏఓ బాబురావు, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వాసం రాణి, సొసైటీ చైర్మన్ యెల్లిన రాఘవరావు, మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు, ఇతర జిల్లా స్థాయి అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









