+91 95819 05907

డైలీ వేజ్ వర్కర్ల సమ్మెకు బీఆర్‌ఎస్ నాయకుల మద్దతు -కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్ 17: అశ్వారావుపేట మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న సమ్మెకు అశ్వారావుపేట బీఆర్‌ఎస్ మండల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డైలీ వేజ్ వర్కర్లకు ₹26,400 వేతనం చెల్లించేవారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కనీస వేతనాన్ని ₹11,000 కు తగ్గించడం చాలా దుర్మార్గమైన చర్య అని బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు సమ్మె మొదలుపెట్టి ఆరు రోజులు అవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని చెబుతున్న ప్రభుత్వం, పిల్లలకు అన్నం పెట్టే కార్మికులు సమ్మెలో ఉంటే, భోజనం ఎలా పెడతారో ఆలోచించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వారు విమర్శించారు. రైతులు, ప్రజల కష్టాలను గాలికి వదిలేసి, నాయకులు కేవలం ఫోటోలకు పోజులివ్వడానికి మాత్రమే సరిపోతున్నారని ఎద్దేవా చేశారు. తక్షణమే ప్రభుత్వం డైలీ వేజ్ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, జీవో నం.64ను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాష్ రావు, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, బరగడ కృష్ణ, నియోజకవర్గ నాయకురాలు వగ్గేల పూజ, మండల నాయకులు మందపాటి రాజా మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్, అశ్వారావుపేట టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, జుజ్జురపు శ్రీరామమూర్తి, ఈదర రాంబాబు, మాజీ ఎంపీటీసీ పద్దం శ్రీను, మాలోతు రామారావు, నవీన్, హరికృష్ణ, అమీర్, వేజ్ వర్కర్లు జెట్టి వేంకటేశ్వర రావు, జెట్టి సత్యం, మాడివి వేంకటేశ్వర రావు, భూక్యా లక్ష్మీ, కారం బద్రమ్మ, తోట సీత, బుగ్గ రాంభాయ్, వెట్టి మంగ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !