నేటి గదర్ కరకగూడెం: మండల పరిధిలోని కుర్నవల్లి గ్రామానికి చెందిన పోలేబోయిన ఆదినారాయణ (అర్ఐ) తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు వారి నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన వెంట పాల్గొన్నారు.
Post Views: 124









