దమ్మపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా, సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే తాటి
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, సెప్టెంబర్, 18: రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్స్ తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు దమ్మపేటలో ఆందోళనలో పాల్గొన్నారు. కార్మికులు, అఖిలపక్ష నాయకులతో కలిసి ఆయన తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి, ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల నుంచి విద్యార్థుల వరకు అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారని అన్నారు. ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.









