మెదక్ జిల్లా నేటి గదర్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) సెప్టెంబర్ 18.
మెదక్ జిల్లా చేగుంట పోలీస్ ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బబ్న వులి చానుకి పోస్ట్ ఉత్తరప్రదేశ్ చెందిన సవాల్ పాండే తండ్రి సురేందర్ పాండే వయసు 40 సం,వృత్తి లారీ డ్రైవర్ మరియు అతని తమ్ముడు నీలేష్ పాండే, వయస్సు. 22 సం, ఇద్దరి నివాసము బబ్న వులి చానుకి పోస్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గార్లు లారీలో పాపిస్ట పౌడరు రవాణా చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు మాసాయిపేట గ్రామ శివారులోని బాబా రాందేవ్ రాజస్థాన్ దాబా వద్ద చేగుంట ఎస్సై జి చైతన్య కుమార్ రెడ్డి,మరియు సిబ్బంది తనిఖీ చేయగా వారి వద్ద నుండి సుమారు 5.8 కిలోల పాపిస్తా పౌడరు స్వాధీనం వాటి విలువ సుమారుగా 87000 ఉంటుందని ఎస్సై తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి లారీని స్వీజ్ చేసి రిమాండ్ కు తరలించామని ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు . ఇదిలా ఉండగా బాబా రాందేవ్ రాజస్థాన్ డాబా దగ్గర మత్తు పదార్థాలు చాలాసార్లు దొరకడం విశేషం. హైవే పెట్రోలింగ్ మరియు పోలీసు వారు పగడ్బందీగా హైవే దగ్గర ఉన్న డాబాల పై ఎప్పటికప్పుడు నిగా ఉంచితే గంజాయి తెలంగాణ రాష్ట్రం నిషేధించిన వస్తువులు దొరుకుతాయని పలువురు మీడియాకు తెలిపారు.









