నేటి గదర్ కరకగూడెం:మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య ఆధ్వర్యంలో అపార్టీ నాయకులతో సమావేశమైనారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మద్యం షాపులు ఎంఅర్ పి ధరల్లో అమ్మకుండా బెల్ట్ షాపులకు ఎక్కువ రేట్లకు మందు ఇవ్వడం వలన ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ రేట్లకు అమ్మడం వలన ప్రజలపై అధిక భారం మోపుతున్నారని మద్యాన్ని ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని డిమాండ్ చేశారు. ఈ మద్య అమ్మకలపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఎమ్మార్పీ ధరలకు అమ్మించాలని కోరుతూ
మద్యాన్ని ఎమ్మార్పీ ధరలకు అమ్మని యెడల ప్రజల యొక్క పూర్తి మద్దతుతో మండల వ్యాప్తంగా ప్రజల పక్షాన నిలబడి బిఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి కొమరం రాంబాబు పోగు వెంకటేశ్వర్లు రేగా సత్యనారాయణ కొంపల్లి చిన్న రామలింగం పాయాం నరసింహారావు కట్టుకోజుల వేణు చిట్టి మల్ల ప్రవీణ్ గంధర్ల సతీష్ నిట్ట ప్రభాకర్ ఎలాగొండ శ్రీనివాస్ బంధు సతీష్ ఊకె నరేష్ పోలె బోయిన శేఖర్ రావుల సమ్మయ్య కల్లూరి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.









